VijayaKumar

Apr 20 2024, 13:37

వలిగొండ మండల కేంద్రంలో అర్ధరాత్రి చోరీ... వివరాలు సేకరిస్తున్న పోలీసులు

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భీమిడి మధుసూదన్ రెడ్డి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది . ఇంటిలో నుండి మూడున్నర తులాల బంగారం, 30 తులాల వెండి, 30 వేలు నగదు ను దొంగలు ఎత్తుకెళ్లారు .సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్న స్థానిక పోలీసులు, చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి. మరో ఇంట్లో ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి తల దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

VijayaKumar

Apr 20 2024, 07:52

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గూడూరు శివశాంత్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గొల్నేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గూడూరు శివశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ సర్పంచులు, మదర్ డైరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్ రెడ్డితో సుమారు 200 మంది కార్యకర్తలు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో వలిగొండ లోని వారి స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు .వీరికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ ఈనెల 21న నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, బోల్ల శ్రీనివాస్ ,గరిసె రవి , పల్సం సతీష్, గంగాపురం దైవా ధీనం, బాబు ,యాదయ్య, వెంకట్ రెడ్డి, మల్లేశం, యూత్ అధ్యక్షులు గంగాపురం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 19 2024, 21:57

గోపరాజు పల్లి కి చెందిన కీసర్ల వంశీధర్ రెడ్డి - శివాని ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం సోదరుడు కొండల్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కీర్తిశేషులు కీసర్ల వెంకట నరసింహారెడ్డి- శ్రీమతి అనిత  కనిష్ట కుమారుడు కీసర్ల వంశిధర్ రెడ్డి- శివాని వివాహానికి  సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు కొండల్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ,భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై భువనగిరి సాయి కన్వెన్షన్ సెంటర్ లో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గోపరాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కీసర్ల ఉపేంద్ర - సత్తిరెడ్డి, కీసర్ల రోజా- భరత్ రెడ్డి, పాశం ప్రేమలత- వెంకటరెడ్డి, జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు, గోపరాజుపల్లి గ్రామం చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, బంధువులు స్నేహితులు ,తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 19 2024, 20:15

మానవత్వం చాటుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మానవత్వం చాటుకున్నారు .భువనగిరి లో పెళ్లి వేడుకలకు హాజరై వెళుతుండగా భువనగిరి సమీపాన వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడ ఆగి క్షతగాత్రులను తన సొంత వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

క్షతగాత్రులది జనగామ జిల్లాగా తెలిపారు .ప్రమాదంలో మహిళలకు గాయాలయ్యాయి.

VijayaKumar

Apr 19 2024, 19:26

విద్యార్థుల మృతిపై న్యాయం జరిపించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ కి వినతి పత్రం అందజేసిన పల్ల గొర్ల మోదీ రాందేవ్


 భువనగిరి ప్రభుత్వ ఎస్సీ గురుకులా హాస్టల్లో మృతిచెందిన ఘటనలపై విచారణ జరిపించాలని SC ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ ను సెక్రటేరియట్లో కలిసి వినతిపత్రం ఇచ్చిన SC,ST,BC హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని మృతి చెందిన ప్రశాంత్ అలాగే రెండు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య, వైష్ణవి, 1 ఇయర్ క్రితం చనిపోయిన మనోహర్ ఇలా యాదాద్రి జిల్లాలో మూడు సంవత్సరాల వ్యవధిలో 9 మంది విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా sc సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు విద్యార్థుల ప్రాణాలంటే ఈ అధికారులకు దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది జరిగిన ఘటనలకు బాధ్యులైన అందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసేయాలని విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని జిల్లా మరియూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో tssA అధ్యక్షులు కూరెళ్ళ మహేష్, MRPS నాయకులు చిట్టిపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 18 2024, 22:32

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని కంచనపల్లికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. భాస్కర్ రెడ్డి వలిగొండకు టీఆరెస్ జండా తెచ్చిన మొదటి వ్యక్తి , ఆయన  2001 నుండి టీఆరెస్ లో కొనసాగుతూ తెలంగాణ ఉస్యమంలో చురుకైన పాత్ర పోషించారు.మండలంలోని బునాదిగాని కాలువ మంజూరు కోసం అహర్నిశలు కష్ట పడి పాద యాత్ర చేశారు. భాస్కర్ రెడ్డి టీఆరెస్ లో మండల అధ్యక్షుడిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు గా, రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదవులు నిర్వహిస్తూ కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేశారు. కేసీఆర్ ఉద్యమ కారులను పక్కకు పెడుతూ కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని నిరసనగా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపి లో చేరినట్లు ఆయన తెలిపారు.

VijayaKumar

Apr 18 2024, 17:57

మృతి చెందిన గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి ఆర్ వెంకట్ రెడ్డి యం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్


 యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురై 6వ తరగతి చదువుచున్న విద్యార్ధి సీహెచ్ ప్రశాంత్(12) గత ఆరు రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయని,    ఎం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామంలో ప్రశాంత్ తల్లిదండ్రులను, తాత, నానమ్మ, అమ్మమ్మ, మేనమామలను కలిసి ఓదార్చి, వారికి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న రాత్రి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురయ్యారని, ఐతే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భువనగిరి గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన తెలంగాణా రాష్ట్రం లో మొదటిదీ కాదు చివరిదీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ 

రాష్ట్రం లో సుమారు 982 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాలల్లో దాదాపు 5,58,923 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన తెలిపారు. కొన్ని గురుకులాల దుస్థితి, విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయమైన స్థితిలో ఉన్నాయని , అట్టహాసంగా గురుకులాలు ఏర్పాటు చేయడం, ఉన్న వాటిని జూనియర్ కాలేజీలుగా అఫ్ గ్రేడ్ చేయడం చేసారు కానీ ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియను, మౌలిక వసతుల కల్పన ను గాలికి వదిలి వేసారని ఆయన ఆరోపించారు.

అత్యధిక శాతం గురుకులాలు ప్రైవేటు భవనాలలో కొన్ని జిల్లాల్లో రెండు మూడు గురుకులాలు ఒకే భవనంలో నిర్వహిస్తున్నారని , వసతుల విషయంలో కానీ భోజన విషయంలో కానీ నిర్ణయించిన ప్రమాణాలు పాటించకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు అస్వస్థకు గురైన వారు కొందరైతే, కొంత మంది ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని ఆయన అన్నారు . విద్యార్థుల భోజన నాణ్యతా మీద కానీ, నాణ్యమైన విద్య అందించడంలో కానీ, తల్లిదండ్రులు బయటి వారికి ఎవ్వరికీ కూడా ఫిర్యాదు చేయవద్దని చేసిన వారికి టిసి లు ఇచ్చి పంపి వేస్తామని గురుకుల పాఠశాలల సిబ్బంది చే బెదరింపులు, అంతే కాకుండా ఈ విషయాలు అడిగిన పిల్లలను శారీకంగా హింసకు గురి చేసిన సంఘటనలు కూడా నిత్యం జరుగుతున్నాయని ఆయన అన్నారు. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలి వేసారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 76% గురుకులాలు అర కొర వసతులతో అద్దె భవనాలలో నడుస్తున్నాయని ( బి. సి 119 కి 103, మైనారిటీ 204 కు 190 ,SC: 238 కు 136 అద్దె భవనాలలో). కే జీ బి వి లల్లో ఉన్న 1,00,536 ఆడ పిల్లలు మౌలిక సదుపాయాలు లేక చాల ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. రోజుకు మూడు పూటలు భోజనానికి కలిపి మొత్తం 30 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం 

నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించేందుకు బడ్జెట్ ను పెంచాలని, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు వేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో అనుసరించాల్సిన ప్రమాణాలపై నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించాలని, అవి ఖచ్చితంగా అమలు అయ్యేలా తగిన పర్యవేక్షణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని , ప్రత్యేక కమిషన్ ను వేసి గురుకుల పాఠశాలల తీరును పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆయన వెంట బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, సామాజిక ఉద్యమ నాయకురాలు బుద్ధుల సునీత లు ఉన్నారు.

VijayaKumar

Apr 18 2024, 17:51

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: కుంభం కీర్తి రెడ్డి


కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం లోని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వాటిని బూతులు బూత్ కమిటీలు గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో మహిళలను ప్రజలను చైతన్యపరిచి భువనగిరి నియోజకవర్గం నుండి గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు గత అసెంబ్లీ ఎన్నికలలో కార్యకర్తలు కష్టపడి అహర్నిశలు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు అదే ఉద్దేశంతో భువనగిరి ఎంపీ కి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులను శ్రీమతి కుంభం కీర్తి రెడ్డి గారు కోరారు ఈ కార్యక్రమంలో సుక్క స్వామి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎగ్ సర్పంచ్ మరియు పులిగిల్ల బాలయ్య ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గొల్లపెల్లి అశోక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 18 2024, 17:35

ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్


      జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమును పోరాడి సాధించిన సిపిఎం ను, చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్న మోడీ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి యుండి. జహంగీర్ గారిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్ నర్సింహ్మ పిలుపునిచ్చానారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని పెంచికల్ పహాడ్, అనాజిపురం గ్రామాలలో సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి యండి.జహంగీరి గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పెంచికల్ పహాడ్ గ్రామంలో పని చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు.అనాడు వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరాడి సాధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధికి ఉపయోగపడుతూ రెండు పూటల తిండి తినడానికి ఉపయోగపడుతుందని, గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలు గౌరవంగా జీవించడానికి ఉపాధి హామీ పనులు తోడ్పడుతున్నాయని అన్నారు. కానీ నేడు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్ర కోణం నుండి ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ కార్మికుల పైన అనేక భారాలు మోపుతూ చట్టంలో ఉన్న సౌకర్యాలు అన్నింటినీ ఎత్తివేస్తున్నదని మొత్తమే చట్టం లేకుండా చేయాలనే ఆలోచనలో బిజెపి ఉన్నదని ఈఎన్నికల్లో బిజెపి నీ ఓడించకపోతే ఉపాధి చట్టం ఉండదని పేదలందరూ ఐక్యంగా బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మరోపక్క నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ పేదల పైన భారాలను మోపుతున్నదని కార్మిక చట్టాలను కాలరాస్తూ పనివారాన్ని పెంచుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపితో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యాయి అని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ప్రజా ఉద్యమాల సారధి సిపిఎం సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగిర్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్ , కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఎదునూరి వెంకటేశం, నాయకులు బిక్షపతి బాలయ్య, స్వామి, బాలరాజు, శ్రీకాంత్, వెంకటేశు, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

       

VijayaKumar

Apr 18 2024, 17:19

భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తోనే సాధ్యం: పడమటి జగన్మోహన్ రెడ్డి


వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలో భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి గెలుపు కొరకై ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు ఒక్కొక్కటిగా వివరించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని వారిని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు సీఎన్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ రాచకొండ కృష్ణ గారు, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ గారు, మండల ఉపాధ్యక్షులు సంతోష్ గారు, భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ గారు, టేకుల సోమరం గ్రామ బూత్ అధ్యక్షులు పాటి వెంకట్ రెడ్డి , నవీన్ రెడ్డి, రామకృష్ణ , అంబరీష్ , భాను ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.